గెలుపు మాదంటే మాది అంటున్న చంద్రబాబు, జగన్

chandrababu and jagan

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సంగ్రామం పూర్తి అయ్యింది. ఓటర్ల తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తం అయ్యింది. ఫలితాలు తేలాలంటే మే 23వరకు ఆగాల్సిందే. అయితే గెలుపు పై టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ రెండూ ధీమాగానే ఉన్నాయి. పోలింగ్ తరువాత మీడియాతో మాట్లాడిన జగన్ ల్యాండ్ స్లైడ్ విక్టరీ అంటూ నమ్మకంగా చెప్పారు. చంద్రబాబును గద్దె దించడానికి పెద్ద సంఖ్యలో ప్రజలు బారులు తీరి ఓట్లు వేశారని చెప్పుకొచ్చారు. పెరిగిన ఓటింగు శాతం మాకే అనుకూలం అని చెప్పారు.

గురువారం అర్ధరాత్రి సమయంలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ నాయకులతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం తెదేపాకు 130 శాసనసభ స్థానాలు వస్తాయని, ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని తెలిపారు. ఓట్ల లెక్కింపు పూర్తయ్యేంత వరకు ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్‌రూంల వద్ద షిఫ్టుల వారీగా కాపలా కాయాలని సూచించారు. రెండు వైపుల వారు ధీమాగా ఉండడంతో ఈ ఎన్నికలు ఎటువైపు మొగ్గు చూపుతాయనేది ఆసక్తికరంగా ఉంది.

Comments

comments