చంద్రబాబు నాలిక చీరేస్తా…

చంద్రబాబు నాలిక చీరేస్తా...

బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు 2014 ఎన్నికలయిన రెండో రోజు నుండి టీడీపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఆయన చేశారో మోడీ చేయించారో తెలీదుగానీ మొత్తానికి టీడీపీ బీజేపీని విడదీశారు. అంతా చేసి బీజేపీ రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా ప్రకటిస్తే ఓటమికి భయపడి తప్పుకున్నారు. ఇప్పుడు ఆయన బీజేపీ అభ్యర్థులకు స్టార్ క్యాంపెయినర్ అట. ఏకంగా బీజేపీ ప్రచార కమిటీ రాష్ట్ర చైర్మన్‌. బుధవారం ఆయన అనంతపురంలో విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు మీద తీవ్ర విమర్శలు చేశారు.

ప్రధాని నరేంద్ర మోదీ తల్లి గురించి సీఎం చంద్రబాబు పదేపదే ప్రస్తావిస్తున్నారని, మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఆయన నాలుకు చీలుస్తామని హెచ్చరించారు. చంద్రబాబు ఈ ఐదేళ్లూ అవినీతి, అక్రమాలే చేశారన్నారు. దొంగలెక్కలు చూపి అవార్డులు దక్కించుకున్నారని ఆరోపించారు. కేంద్రం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల పేర్లు మార్చి తానే ప్రవేశపెట్టినట్లు గొప్పలు చెప్పుకున్నారని మండిపడ్డారు. ఈ ప్రగల్బాలకేంగానీ పోటీ చేసి సత్తా నిరూపించుకోవాల్సింది వీర్రాజు గారు.

Comments

comments