బిగ్ బాస్ కౌశల్ రాజకీయాలలోకి వస్తారట?

kaushal-gives-clarity-on-film-offers-rc12

ప్రతిష్టాత్మకమైన బిగ్ బాస్ రెండవ సీజన్ విజేత కౌశల్ మందాకు తనను తాను ఎక్కువగా ఊహించుకునే అలవాటు ఎక్కువ. షో అయిపోయినా బయటకూడా తాను బిగ్ బాస్ నే అని స్టార్ హీరోలతో సమానంగా తనకు క్రేజ్ ఉందని ఆయన భావిస్తుండడం గమనార్హం. ఆ షో అయ్యాక సినీ హీరోగా బిజీ అయిపోతా అని ఆయన చెప్పుకున్నా అటువంటిది ఏమీ జరగలేదు. ఇప్పుడు ఆయన ఏకంగా రాజకీయాలలోకి రావాలని అనుకుంటున్నారట.

తన సొంత జిల్లా అయిన విశాఖపట్నం నుండి అసెంబ్లీకి గానీ, పార్లమెంట్ కు గానీ పోటీ చెయ్యడానికి ఆయన ఆసక్తి చూపిస్తున్నారట. ఏ పార్టీ తనకు టికెట్ ఇస్తే ఆ పార్టీలో చేరడానికి సిద్ధం అని ప్రధాన పార్టీలను సంప్రదిస్తున్నారట. తనకు సీటు ఇస్తే రాష్ట్రమంతా పర్యటించి తన కౌశల్ ఆర్మీతో ఓట్లు వేయిస్తా అని చెబుతున్నారట. చివరికి రాజకీయాలు అంటే అంత ఆషామాషీ అయిపోయాయి. కౌశల్ ఆఫర్ ను ఏ పార్టీ అయినా తీసుకుంటుందేమో చూడాలి మరి.

Comments

comments