మోదీ నిజంగా మగాడైతే … బాలయ్య వివాదాస్పద వ్యాఖ్యలు..

హిందూపురంలో ప్రచారం సందర్భంగా ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అనేక వివాదాలకు కేంద్రబిందువు అవుతున్నారు. తాజాగా ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మోదీ నిజంగా మగాడైతే తన తిట్లకు సముద్రంలో దూకి చావాలని బాలయ్య వ్యాఖ్యానించారు. మోదీకి సిగ్గు, శరం లేవని.. కేసీఆర్‌, జగన్‌, మోదీ తననేమీ చేయలేరని బాలకృష్ణ వ్యాఖ్యానించడం విశేషం. గతంలో కూడా బాలయ్య మోడీ మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేసి కలకలం రేపారు.

హిందూపురం తెలుగుదేశం పార్టీకి కంచుకోట. 1982లో తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుండి 2014 వరకు జరిగిన తొమ్మిది ఎన్నికలలో వరుసగా ఆ పార్టీ అభ్యర్థులే గెలుస్తూ వస్తున్నారు. స్వర్గీయ నందమూరి తారకరామారావు ఇక్కడ నుండి మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నందమూరి హరికృష్ణ కూడా ఒక సారి ఎన్నికయ్యారు. 2014 ఎన్నికలలో బాలయ్య ఇక్కడ నుండి 16,196 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ సారి మెజారిటీని మరింత పెంచుకుంటా అని నమ్మకంగా ఉన్నారు.

Comments

comments