రేపు తెలంగాణలో మంత్రులుగా ప్రమాణం చేసేది వీరేనా?

KCR's Whirlwind Tour in 16 MP Constituencies of Telangana

ఎన్నాళ్లగానో వేచి చుసిన తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఎట్టకేలకు రేపు జరగబోతుంది. రేపు మంత్రులుగా ప్రమాణం చేయబోయే పలువురు ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్ ఫోన్ చేసి ప్రగతి భవన్‌కు రావాలని చెప్పారు. దీంతో ఎర్రబెల్లి దయాకర్ రావు, నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, కొప్పుల ఈశ్వర్, ఇంద్రకరణ్‌రెడ్డికి సీఎం కేసీఆర్‌ నుంచి పిలుపు వచ్చింది. రంగారెడ్డి జిల్లా నుండి మల్లారెడ్డికి కూడా పదవీ యోగం ఉన్నట్టు తెలుస్తుంది. మాజీ ఆర్ధిక మంత్రి ఈటెల రాజేంద్ర విషయంలో ఇంకా సస్పెన్స్ కొనసాగుతుంది.

మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి పరిస్థితి కూడా అంతే. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌ రావుకు చోటు ఉండదని తెలుస్తుంది. మొదటి టర్మ్ లో కేసీఆర్ తన మంత్రివర్గంలో ఒక్క మహిళకు కూడా అవకాశం ఇవ్వలేదు. ఈ తడవ కూడా అదే జరిగే అవకాశం కనిపిస్తుంది. ఉదయం 11:30 గంటలకు రాజ్‌భవన్‌లో కొత్త మంత్రులు ప్రమాణస్వీకారం చేయనున్నారు. సార్వత్రిక ఎన్నికల తరువాత మరో విడత మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉందని సమాచారం.

Comments

comments