ఆంధ్రజ్యోతి టీడీపీ వైపా? వైఎస్సార్ కాంగ్రెస్ వైపా?

విజయసాయి రెడ్డి ఆడియో లీక్ అంటూ ఆంధ్రజ్యోతి ఛానల్ హడావిడిగా ఒక టేప్ ను రిలీజ్ చేసింది. ఆ టేప్ వైఎస్సార్ కాంగ్రెస్ కు అతిపెద్ద సెల్ఫ్ గోల్ అంటూ తీర్మానం చేసేసింది కూడా. అయితే ఆ సెల్ఫ్ గోల్ వైకాపా లేక టీడీపీ కా అనేది అర్ధం కాకుండా ఉంది. విజయసాయిరెడ్డి ఎన్నికలలో అలసత్వం వద్దు అంటూ ఆ పార్టీ నాయకులకు క్లాస్ పీకుతున్నారు. అందులో తప్పైతే లేదు. ఒకానొక సందర్భంలో మోడీ తమకు ఏమి సాయం చెయ్యడం లేదని, సాయం అవసరం లేకుండానే గెలుస్తాం అని ఆయన చెప్పుకొచ్చారు.

ఇలా చెప్పుకోవడం తో వైఎస్సార్ కాంగ్రెస్ బీజేపీ రహస్యాస్నేహం పై వస్తున్న ఆరోపణలను తిప్పి కొట్టినట్టు అయ్యింది. అదే క్రమంలో జగన్ నీతిమంతుడు, చంద్రబాబు దుర్మార్గుడు అంటూ చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ ను అందులో ఏమైనా ఇబ్బంది పెట్టేది ఉంటె అది మోడీని స్వార్ధపరుడు అని చెప్పడమే. ఈ విషయం తెలిస్తే మోడీ తానేంటో చూపిస్తాడు. అసలు ఈ టేప్ లో పెద్దగా వైఎస్సార్ కాంగ్రెస్ ను ఇబ్బంది పెట్టేది ఏమీ లేదు. అసలు ఇప్పుడు దానిని విడుదల చేయాల్సిన అవసరమెంటో?

Comments

comments