హవ్వా… అమరావతి హైకోర్టు జనరేటర్‌ రూం గోడ కూలింది

ప్రపంచంలోనే అత్యంత ఉత్తమ రాజధానిని నిర్మిస్తామంటూ ప్రకటనలతో ఊదరగొట్టే ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి మరో పరాభావం. అమరావతిలో తాత్కాలిక భవనాల నాసిరకం పనుల కారణంగా, హైకోర్టు భవనం లో నిర్మాణం లో ఉన్న జనరేటర్‌ రూముల స్లాబ్ కూలిపోయింది. ఈ సంఘటనలో నలుగురు కార్మికులు గాయపడ్డారు. వీరిని తాడేపల్లి సమీపంలోని ఎన్‌ఆర్ఐకి ఆస్పత్రికి తరలించారు. కార్మికులంతా జార్ఖండ్‌కు చెందినవారు.

వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన నిన్నే జరిగినా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మీడియాను రానివ్వకుండా ప్రభుత్వం జాగ్రత్త పడింది. ఇప్పటికే అమరావతి సచివాలయం విషయంలో చంద్రబాబు అభాసుపాలైన విషయం తెలిసిందే. నాసిరకం పనుల కారణంగా కొద్దిపాటి వర్షానికే ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఛాంబర్‌తో పాటు, మంత్రుల కార్యాలయాల్లోకి వర్షపు నీరు చేరడం తెలిసిందే.

Comments

comments