పార్టీ మారితే మాత్రం మరీ ఇలా మాట్లాడాలా?

పార్టీలు మారిన నేతలు పాత పార్టీ గురించి ఏం మాట్లాడతారో కూడా అర్ధం కాదు. వివరాల్లోకి వెళ్తే చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు పంపించారు. వెంటనే లోటస్ పాండ్ కు వెళ్ళి జగన్ ను కలిశారు. ఆ తరువాత మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు మీద విమర్శలు కురిపించారు. రాష్ట్రానికి జగన్ ఒక్కడే ఆప్షన్ వేరే దిక్కు లేదన్నారు. ఇక్కడి వరకు అంతా ఒకే.

“చంద్రబాబుకు అనుభవం ఉందని అధికారం ఇస్తే చిన్న విషయానికి హైదరాబాద్ నుంచి పారిపోయారు. అసలు హైదరాబాద్‌ నుంచి ఎందుకు రావాల్సి వచ్చింది? అమరావతిలో ఉద్యోగులకు కనీసం మంచినీళ్లు, కూర్చోడానికి చెట్ల నీడ కూడా లేదు,” అని ఆయన విమర్శించారు. విశేషం ఏమిటంటే 2014లో స్వతంత్రుడిగా గెలిచిన ఆమంచి ఓటుకు నోటు కేసు తరువాతే టీడీపీలో చేరారు. ఇవేమీ తెలియకుండానే చేరారేమో. మరో పక్క అమరావతిలో ఉద్యోగులకు కనీసం మంచినీళ్లు, కూర్చోడానికి చెట్ల నీడ కూడా లేదంటే అసలు ఆయన ఎప్పుడన్నా అమరావతి వెళ్ళారో లేదో.

Comments

comments