సైరాలో అల్లు అర్జున్ ప్రత్యేకమైన పాత్ర..మెగా ఫ్యాన్స్ కు పండుగే..

సైరాలో అల్లు అర్జున్ ప్రత్యేకమైన పాత్ర..మెగా ఫ్యాన్స్ కు పండుగే..

మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమాగా తెరకెక్కుతున్న సైరా నరసింహా రెడ్డి శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ ఇయర్ దసరా బరిలో సైరా వస్తుందన్న వార్తలు వస్తున్నాయి. కొణిదెల ప్రొడక్షన్స్ లో రాం చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమాను సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నారు. అమితాబ్ బచ్చన్, సుదీప్, విజయ్ సేతుపతి, జగపతి బాబు వంటి స్టార్స్ ఈ సినిమాలో భాగమవుతున్నారు.

ఉయ్యాలవాడ నరసిం హా రెడ్డి బయోపిక్ గా వస్తున్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ కూడా నటిస్తాడన్న వార్తలు వస్తున్నాయి. అయితే సినిమాలో బన్ని కనిపించడు కాని వినిపిస్తాడట. అదేంటి అంటే సైరా సినిమాలో అల్లు అర్జున్ నటించడట కేవలం వాయిస్ ఓవర్ మాత్రమే ఇస్తాడని అంటున్నారు.

ప్రతి సందర్భంతో పాటుగా ప్రతి పాత్ర ఇంట్రడక్షన్ కు బన్ని వాయిస్ ఓవర్ ఉంటుందట. కచ్చితంగా బన్ని వాయిస్ ఓవర్ కూడా సినిమాకు ప్లస్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. సైరా సినిమాలో చిరు లుక్ అద్భుతంగా ఉంటుందని తెలుస్తుంది. మొన్నామధ్య వచ్చిన టీజర్ సినిమాపై అంచనాలు పెంచేసింది.

చిరంజీవి మీద ఎప్పుడు తన ప్రేమ అభిమానం చూపించే అల్లు అర్జున్ సైరా కోసం తన వాయిస్ ఓవర్ అందిస్తున్నాడని తెలుస్తుంది. నా పేరు సూర్య తర్వాత కొద్దిపాటి గ్యాప్ తో త్రివిక్రంతో సినిమా ఫిక్స్ చేసుకున్న బన్ని త్వరలో ఆ సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్తున్నాడు. ఈ సినిమా తర్వాత సుకుమార్ తో అల్లు అర్జున్ సినిమా ఉంటుందని తెలిసిందే.

Comments

comments