జనసేన టిక్కెట్ల కోసం 2410 దరఖాస్తులు

pawan-kalyan-behaving-as-a-miser

నిన్నటితో జనసేన అభ్యర్ధిత్వాలకు గడువు ముగిసిపోయింది. శాసనసభ, పార్లమెంట్ ఎన్నికలకు గానూ ఏకంగా 2410 దరఖాస్తులు వచ్చాయని స్క్రీనింగ్ కమిటీ ప్రకటించింది. లింగం, వృత్తి, విద్యార్హతలు, వయసుని బట్టి విడి విడిగా చూపించి అన్ని వర్గాలలోనూ తమ పార్టీ పట్ల విపరీతమైన ఆసక్తి ఉందని జనసేన పార్టీ చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఈ దరఖాస్తులను వడబోసి అభ్యర్థులను ఖరారు చెయ్యాల్సి ఉంది. వచ్చే వారంలోనే ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది.

జనసేన పార్టీలో ఇప్పటివరకూ పవన్ కళ్యాణ్ పోటీ చేసే సీటు పై కూడా క్లారిటీ లేదు. అలాగే టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలలో టిక్కెట్లు దొరకని వారు కూడా పార్టీలో చేరతారని వారి కోసం వేచి చూస్తూ కొంత మేర అభ్యర్థులను ఖరారు చెయ్యడంలో ఆలస్యం చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ ఏమీ చెయ్యబోతున్నారు అనేది చూడాలి. మొత్తం 175 నియోజకవర్గాలలో పోటీ చేస్తామని, వామపక్షాలతో తప్ప ఎవరితోనూ పొత్తులు ఉండవని ఆయన ఇప్పటికే స్పష్టం చేశారు.

Comments

comments