10 మంది ఎమ్మెల్యేలు…నలుగురు ఎంపీలు టీడీపీని వీడతారా?

ఎన్నికల దగ్గరలో టీడీపీ నుండి వైఎస్సార్ కాంగ్రెస్ కు వలసలు పెరిగాయి. ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ ఇప్పటికే ఆ పార్టీ నుండి వెళ్ళి లోటస్ పాండ్ లో వైఎస్సార్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇదివరకే ఒకే ఎమ్మెల్యే జనసేనలో చేరిపోయారు. అధికారపార్టీ కొంత అయోమయంలో ఉన్నా వీటివల్ల తమకు నష్టం లేదని, తాము కాదు అనుకున్న వారే పార్టీని వీడుతున్నారని చెప్పుకుని సమాధాన పడుతున్నారు. ఈ క్రమంలో మరో 10 మంది ఎమ్మెల్యేలు…నలుగురు ఎంపీలు టీడీపీని వీడతారని పుకార్లు షికారు చేస్తున్నాయి.

ఇందులో నిజమెంతో గానీ ఇదే గనుక జరిగితే టీడీపీ ఓటమి దిశగా పయనిస్తోంది అని ప్రజలకు సంకేతాలు వెళ్ళి నష్టం జరుగుతుంది. టీడీపీ వారి వాదన మాత్రం వేరేగా ఉంది. “ఈ సారి చంద్రబాబు నాయుడు మీద ప్రజలలో మంచి అభిప్రాయం ఉన్నా చాలా మంది ఎమ్మెల్యేల మీద ప్రజలలో వ్యతిరేకత ఉంది. కాబట్టి చాలా మంది సిట్టింగులకు సీట్లు ఉండవని చంద్రబాబు ముందే చెప్పేశారు. ఈ క్రమంలోనే ఈ వలసలు. మాకు పనికిరాని వారు ప్రతిపక్ష పార్టీకి పనికి వస్తారు అనుకుంటే అది మాకు మంచిదే,” అంటున్నాయి టీడీపీ వర్గాలు.

Comments

comments